పూర్వీకుల ఇంటికి మరమ్మతులు చేయించిన కమలహాసన్

  • హాసన్ కుటుంబంతో ఫొటో దిగిన సుహాసిని
  • ఇద్దరూ కలిసి పెరిగింది ఇక్కడే
  • 60 ఏళ్ల నాటి భవనం
ప్రముఖ నటుడు కమలహాసన్ తన పూర్వీకుల భవనానికి మరమ్మతులు చేయించారు. మరమ్మతుల అనంతరం ఈ ఇంటికి హాసన్ కుటుంబం వెళ్లింది. వీరిలో సీనియర్ నటి సుహాసిని కూడా వున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఈ భవనంలోనే పెరిగారట. ఈ భవనం రినోవేషన్ ఫొటోలను సుహాసిని షేర్ చేశారు.

కుటుంబంతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్న ఆమె.. కుటుంబ సభ్యుల ఒక్కొక్కరి పేర్లను పేర్కొన్నారు. ఆ తర్వాత మరమ్మతులు చేయించిన భవనానికి సంబంధించిన మరికొన్ని ఫొటోలను పంచుకున్నారు. ఇప్పటికే ఈ ఫొటోను 20వేల మందికిపైగా లైక్ చేశారు. వీరిలో కమల్ కుమార్తె శ్రుతి హాసన్‌తోపాటు ఆర్. మాధవన్ కూడా ఉన్నారు.

ఇదిలావుంచితే, ఈ ఏడాది విడుదలైన తమిళ ఆంథాలజీ పూథమ్ పుధు కాలైలో ఒక భాగానికి సుహాసిని దర్శకత్వం వహించారు. భర్త మణిరత్నం తీస్తున్న మ్యాగ్నమ్ ఓపస్ 'పొన్నియిన్ సెల్వన్' చిత్రంలో సుహాసిని నటిస్తున్నారు. అలాగే కమలహాసన్ ప్రస్తుతం ఇండియన్ 2, విక్రమ్, పాపనాశం 2, తలైవన్ ఇరుక్కిండ్రన్ చిత్రాలలో నటిస్తున్నారు. తలైవన్ ఇరుక్కిండ్రన్ చిత్రం తమిళ-హిందీ భాషల్లో రూపొందనుంది. దీనిలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

Kamal Haasan
Suhasini
Tollywood

More Telugu News